Monday, December 23, 2024

క్రిప్టో కరెన్సీలపై పన్ను వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది

- Advertisement -
- Advertisement -

Government has power to tax cryptocurrencies

నిషేధించాలా. వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తాం
రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలావాదేవీలనుంచి వచ్చే లాభాలపై పన్ను విధించే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే వాటిని నిషేధించాలా.. వద్దా అన్నదానిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. 23 బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు మంత్రి శుక్రవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆమె క్రిప్టో పన్ను అంశాన్ని ప్రస్తావించారు. ‘క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చట్టబద్ధమా .. కాదా అన్న ప్రశ్న తర్వాత. కానీ ఆ లావాదేవీలద్వారా పొందే లాభాలపై పన్ను విధిస్తాం. ఎందుకంటే అది ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమ హక్కు. క్రిప్టో కరెన్సీలపై నిపుణులతో సంప్రదింపులు అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీలను నిషేధించాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే దానిపై ఎలాంటి చర్యలు చేపట్లేదు’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నెల 1న ప్రవేశపెట్టిన 2022 23 కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ లావాదేవీలను చట్టబద్ధం చేసినట్లే అని మదుపర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి శుక్రవారం స్పష్టత ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News