యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వంలో ఆధునిక వై ద్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే మేలైన వైద్యాన్ని అందిస్తున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని ఐదుగురికి వైద్య చికిత్స కోసం రూ.11 లక్షల ఎల్వోసీలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు.
ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి ఉండేందుకు ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి ఆధునిక వైద్య పరికరాలతో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారని, నిమ్స్ ఆస్పత్రిలో గుండె చికిత్సలతో పాటు అనేక సేవలను అందజేయడం జరుగుతుందని, పేదలకు చేదోడుగా ప్రభుత్వం వైద్యఖర్చు కింద ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.అంతేకాకుండా వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ లాంటి జ్వ రాలు రాకుం డా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ ప్రాంతాలు ఉ ండే అధికారులకు సమాచా రం ఇవ్వాలని సూచించారు.
త్వరలో యాదాద్రి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన..
యాదాద్రిలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 3, 4 స్థలాలు గుర్తించి సీఎంకు నివేదిక సమర్పించినట్లు, సీఎం ఆమోదం వెంటనే మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధ, జడ్పిటిసి అనురాధ, మండల పార్టీ అద్యక్షుడు కర్రె వెంకటయ్య, మిట్ట వెంకటయ్య, కసావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.