హైదరాబాద్: తెలంగాణ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు, దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. గాంధీ, నిమ్స్‌లో ఎంసిహెచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పొటీ పడుతున్నాయని వివరించారు.
Also Read: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ హఠాన్మరణం….. కెసిఆర్ దిగ్భ్రాంతి
2014లో ప్రభుత్వాస్పత్రులో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులలో ప్రసవాలు 70 శాతానికి చేరాయని కొనియాడారు. అవయవాల మార్పిడిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. జూన్ 14 నుంచి కెసిఆర్ నూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తామన్నారు. తెలుగు సినిమాలను ప్రపంచం గుర్తించే విధంగా రాజమౌళి దర్శకత్వం వహించారని హరీష్ ప్రశంసించారు. బాహుబలి సినిమా దేశంలో రికార్డు సృష్టిస్తే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. ప్రసవ సమయంలో తల్లి, బిడ్డల మృతుల సంఖ్య స్థానంలో తెలంగాణ చివరగా ఉందని వివరించారు.