- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ బాలాజీ అన్నారు. యాదాద్రి కలెక్టర్ ఆదేశాలతో సోమవారం మోత్కూరు మున్సిపల్ పరిధిలోని బుజిలాపురంలో గర్భిణిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణి రావులకొల్లు రేణుకకు న్యూట్రిషియన్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణిలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు ఉంటారని, పూర్తిస్థాయి మౌళిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ త్రివేణి, అంగన్‌వాడి టీచర్ విజయ్, ఏఎన్‌ఎం గురువమ్మ, ఆశావర్కర్ ఉమ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -