నల్లగొండ: భూ-నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉ ంటుందని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి మండలం తవక్లపూర్‌లో కెనాల్ క్రింద ముప్పునకు గురై న భూ-నిర్వాసితులకు 21మంది తవక్లపూర్ గ్రామ రైతులకు రూ.80లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంపునకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆయన తెలిపారు. ప్రతి ఎకరాకు సాగు, తాగు నీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు,5లిఫ్టులు పూర్తి అయితే రాష్ట్రంలో ఎక్కువ రిజ్వాయర్లు గల నియోజకవర్గంగా అవుతుందని ఆయన తెలిపారు. ని యోజకవర్గాని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం అని ఆయన అన్నారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉం డాలని ఆయన అన్నారు. రైతు బంధు,రైతు బీమా దేశానికి ఆదర్శం అని అన్నారు.
అభివృద్ధి లో సంక్షేమంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాధవరం సునీతజనార్దన్ రావు, రైతు బంధు అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు మాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, భగవంత్ రావు, బొడ్డుపల్లి కృష్ణ, జెపాల్, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.