Monday, December 23, 2024

పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహకం

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: జిల్లాలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని, జులై 11 నాటికి జిల్లాలో 1500 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఆసక్తి గల రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో పండ్ల తోటలు, ఆయిల్ పామ్ సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 5 ఎకరాల లోపు భూమి, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీ లబ్దిదారులకు ఎంపిక చేయడానికి లబ్దిదారుల ఎంపిక చేయడానికి అర్హులని, వీరికి సబ్సీడిపై డ్రిప్ ఇరిగేషనం సౌకర్యం కల్పించడంతో పాటు పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుందని, ఇందుకోసం ఉపాధి హామీ పథకంను వినియోగించడం జరుగుతుందని కలెక్టరం తెలిపారు.

పండ్ల తోటల సాగు కింద మామిడి, నిమ్మ, నారింజ, జామ, సీతాఫలం, సపోట, మునగ, డ్రాగన్, దానిమ్మ ప్లానిటేషన్‌కు 1500 ఎకరాలు ఎంపిక చేయాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కోన్నారు. జూలై చివరి నాటికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆగస్టు నెలాఖరు వరకు డ్రిప్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి, ఉపాధి హామీ పథకం కింద గుంతలు తవ్వి పండ్ల మొక్కలు నాటడం జరుగుతందని కలెక్టరం తెలియజేశారు. పండ్ల తోటలో అంతర్ పంటలు వేసుకునే అవకాశం ఉండడంతో రైతులకు రెండు రకాలుగా ఆదాయం లభిస్తుందని, సంప్రాదాయ పంటలతో రైతుల నష్టపోతున్న నేపథ్యంలో వాటి పరిష్కారంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని, దీనిపై జిల్లాలోని రైతులకు విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.

ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకానికి ఈ సంవత్సరం 2023-24లో 5వేల ఎకరాలలో సాగుకి ప్రభుత్వ అనుమతి లభించిందని, ఆయిలం పామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకం కింద నాలుగు సంవత్సరాలకు 25 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీగా అందజేస్తుందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ఎకరాకు రూ. 50.918 రాయితీ ప్రభుత్వం ఇస్తుందని, ఆసక్తి గల రైతులు దరఖాస్తులు జూలై 30వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణ అధికారికి లేదా ఉద్యానవన అధికారికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమము ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసం, ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి డి. నర్సయ్య, అగ్రికల్చరల్ శాఖ డివిజనల్ అధికారులు, లీవింగ్ ఫుడ్స్ ఇండియా ప్రతినిధి డా. కృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News