- Advertisement -
హైదరాబాద్: పిల్లలకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సీతక్క తెలిపారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆమె శాసన సభలో మాట్లాడుతూ.. విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలు కూడా 212 శాతం పెంచామని చెప్పారు. కల్తీ ఆహారం వంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. మహిళా ఐఎఎస్ అధికారులు నైట్ హాల్ట్ చేయాలని చెప్పామని, వివిధ హోదాల్లోని రాజకీయ నాయకులు కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారని వెల్లడించారు. ఎనిమిదో తరగతి వరకు అందించే స్కాలర్ షిప్ లను 2022లో కేంద్రం నిలిపివేసిందని మండిపడ్డారు. కేంద్రం డైట్ ఛార్జీలు, స్కాలర్ షిప్ ల నిలిపివేతతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడిందని సీతక్క పేర్కొన్నారు.
- Advertisement -