Monday, February 24, 2025

కొత్త మద్యం బ్రాండ్‌లకు ప్రభుత్వం ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్న టిజిబిసిఎల్
మనతెలంగాణ/హైదరాబాద్:  కొత్త మద్యం బ్రాండ్‌లకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే టిజిబిసిఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్‌లను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు టిజిబిసిఎల్ అనుమతులు ఇవ్వనుంది. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టిజిబిసిఎల్ దరఖాస్తులను త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనుంది.

టిజిబిసిఎల్‌లో రిజిస్ట్రర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతపరచాలని టిజిబిసిఎల్ కోరింది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి టిజిబిసిఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ, కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను గతంలో నిలిపివేసిన విషయం తెలిసిందే.

అభ్యంతరాలపై విచారణ జరిపి

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి, కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టిజిబిసిఎల్‌కు నిర్ధేశించింది. టిజిబిసిఎల్ తెలంగాణలో రిజిస్ట్రర్ కానీ, కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులను తీసుకోవడానికి కొత్తగా ప్రకటన జారీ చేసింది.

కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని టిజిబిసిఎల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులకు సంబంధించి టిజిబిసిఎల్ నిర్ణయం తీసుకోనుంది. టిజిబిసిఎల్‌లో రిజిస్ట్రర్ అయి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News