నర్వ : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ ం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పాతర్‌చెడ్ పెద్దకడ్మూర్ గ్రామాల్లో మ న ఊరు … మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పలు అభివృద్ధ్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యభోదన పనితీరు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.
గ్రామ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో ఎంపిపి జయరాములు, వైస్ ఎంపిపి వీణావతి, జడ్పిటిసి జ్యోతి, సింగిల్‌విండో చైర్మన్ లక్ష్మన్న, మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచులు, కరుణాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, దండు అయ్యప్ప , రైతు కో ఆర్డీనేటర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.