Monday, December 23, 2024

కుల వృత్తులకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • రెండో విడత గొర్రెల పంపిణీలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్: కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తు ందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బొంరాస్‌పేట్ మండల పరిదిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన కురువ గొల్ల యాదవులకు ఎమ్మెల్యే రెండవ విడత గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌యస్ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా కుల వృత్తులకు ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు.

చేతివృత్తులు, కుల వృత్తుల వారికి అధిక మొత్తంలో సబ్సిడీలను అందిస్తుందన్నారు. దేశంలో ఏ సర్కారు అందజేయని విధంగా యాదవ, గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తద్వార ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News