విద్యా, వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట
మేడిపల్లి: విద్య, వైద్య రం గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీ ట వేస్తోందని వేములవాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. మేడిపల్లి, భీమా రం మండలాల్లో రూ.1.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంఎల్‌ఎ రమేష్‌బా బు మంగళవారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కల్వకోట గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 12. 24 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను, రూ.24 లక్షలతో నిర్మించిన ఫ్యాక్స్ గోడౌన్, రూ.4 లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ఎంఎల్‌ఎ ప్రారంభించారు. అలాగే దమ్మన్నపేటలో రూ.24 లక్షలతో నిర్మించిన ఫ్యాక్స్ గోడౌన్‌ను ప్రారంభించి, లింగంపేట గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటలో మొక్కలు నాటారు.
మన్నెగూడెం గ్రామంలో రూ.13 లక్షలతో నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధి పెట్టేది ఖర్చు కా దని, అది పెట్టుబడి మాత్రమేనని ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. రానున్న కాలంలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని, గ్రామాల్లో కుల సంఘ భవనాల నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేస్తామని ఎంఎల్ ఎ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, ఎంపిపి ఉమాదేవి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రమ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఫ్యాక్స్ చైర్మన్‌లు, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.