Monday, December 23, 2024

బిసిల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందుకోసం కుల, చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైందని మాజీమంత్రి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ మేరకు గరువారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం లబ్ధిదారుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలని,కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ 1,50,000 పట్టణ ప్రాంతాల వారికి 2,00,000 లోపు ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా గత ఐదేళ్లలో ఏ ప్రభుత్వ, సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నట్లు తేలితే అనర్హులుగా నిర్థారిస్తున్నట్లు ప్రకటించారు.

ఇందుకోసం కొత్తగా ఆన్‌లైన్ దరఖాస్తులు 20తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులు సంబంధిత మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల వారు స్థానిక మునిసిపల్ కమీషనర్‌కు సమర్పించాలని చెప్పారు. ఎంపిక చేసిన వారి జాబిత దశలవారీగా వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తామన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ప్రతీ నెల 15వ తేదీలోగా లబ్ధిదారులకు గ్రాంట్ విడుదల చేయడమే కాకుండా పంపిణీ కూడా జరుగుతుందన్నారు.

పరికరాల ఎంపిక, కొనుగోలు స్థలం బెనిఫిషర్‌కు వదిలివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జెడ్‌పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, పార్టీ అధికార ప్రతినిధి జెవిఎస్ చౌదరి, మునిసిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు,చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News