Saturday, December 21, 2024

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

తానూర్ : మండలంలోని బోంద్రట్ గ్రామంలో శనివారం పలు అభివృద్ధ్ది పనులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంకు భూమి పూజ, బొంద్రట్ గ్రామం నుంచి అమృత్ సబ్ గుట్టకు వెళ్లే రోడ్డు మార్గంలో రూ. 25 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని, రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కెసిఆర్ హయంలో చిన్న చిన్న గ్రామాలను కూడా గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధ్ది విషయంలో ఎంతగానో కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మందాకిని కేశవరావు, మాజీ ఎంపిపి రాజన్న, వైస్ ఎంపిపి చంద్రకాంత్, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పోతా రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రావు, పాటిల్, కోఆప్షన్ సభ్యులు గోవింద్ రావు పటేల్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు విఠల్, మాజీ జడ్పిటిసి ఉత్తం బాలేరావు, భారత జాగృతి యూత్ అధ్యక్షుడు దేవిదాస్, ఏఎంసీ డైరెక్టర్ దేవిదాస్, దిగంబర్ పటేల్, మండల సర్పంచ్‌లు ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వార్డు మెంబర్లు, విడిసి అధ్యక్షుడు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News