గద్వాల : మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కేఎస్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని జిల్లా జడ్పి చైర్ పర్సన్ సరితా, జిల్లా కలెక్టర్‌లు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని, గతంలో జిల్లా ప్రజలు వైద్యం కోసం కర్నూల్, రాయచూర్ వెళ్లేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందని, జిల్లాలో రేడియాలజీ ల్యాబ్, సెంట్ల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేశారని, 55 సబ్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని, మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ఆశలు, ఎఎన్‌ఎంలు సబ్ సెంటర్లలో పని చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలని అన్నారు.
పిహెచ్‌సిలకు ప్రజలు వచ్చేలా చూడాలని, మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. పిహెచ్‌సిలకు అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటు చేసుకోవాలని, మంచి సేవలు అందించాలని కోరారు. దీంతో పాటు మహిళా ఆరోగ్యానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గర్భిణీకి పౌషకాహారం కోసం వారి రక్తహీనత తొలగించడానికి నూ ట్రీషన్ కిట్ అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కెసిఆర్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు ఇవన్ని కూడా తినే విధంగా ఆశాలు ఇంటింటికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఆరోగ్యం కోసం ఇంట్లో వేరే వాళ్లకు కాకుండా గర్భిణులకు ఆహారం అందే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనితో పాటు బిడ్డ పుట్టిన తర్వాత సంరక్షణ కొరకు కిట్టు ఇవ్వడంతో పాటు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆరోగ్య మహిళా సేవలు మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, దీంతో పాటు మహిళా అధికారులు ఉన్న మల్దల్ , క్యాతూర్ , మానవపాడు మూడు పిహెచ్‌సీలలో ఆరోగ్య మహిళ అని మూడు పిహెచ్‌సీలను జిల్లాలో ఈ రోజే ప్రారంభించామన్నారు. ప్రతి మంగళవారం కూడా మహిళలకు ఒపి నిర్వహించడం జరుగుతుందని, మహిళలకు ఉన్న స్పెషల్ సమస్యల మీద ఓపి అండ్ స్కానింగ్ చేయడం జరుగుతుందన్నారు. మహిళల సమస్యలపై డాక్టర్లు, స్టాఫ్ నర్స్, ఆశాలు ప్రత్యేక దృష్టి పెట్టి మీ ఏరియాలో మహిళలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, మహిళలకు మంచి ఆరోగ్య సేవలు అందించేందుకు మహిళల చెక్‌ప్ కొరకు సబ్ సెంటర్లలో 19 మంది వైద్య సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు.
అంతకు ముందు ఆరోగ్య మహిళా పోస్టర్‌ను విడుదల చేశారు. అదే విధంగా ఎన్‌సిడి మందుల కిట్‌ను పంపిణీ చేశారు. న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఉత్తమ వైద్యులకు, నర్సులకు, ఆశా కార్యకర్తలకు యూనిఫాం, మోమెంటో, సర్టిఫికెట్‌లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శశికళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ముసాయిదా బేగం, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపిపి ప్రతాప్‌గౌడ్, భాస్కర్, డాక్టర్ కిషోర్, డా. శ్యం, డా. హృషాలిని , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.