Wednesday, January 22, 2025

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్లరూరల్: అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని, సిఎం కెసిఆర్ రైతు కాబట్టే రైతుల గురించి అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. సిఎం కెసిఆర్ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు పంటలు పండించడానికి ఉచిత కరెంట్ ఇస్తే ప్రతిపక్షాలు 3 గంటలు కరెంట్ సరిపోతుందని చెప్పడం ఏమిటని మండిపడ్డారు. గతంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతులను పట్టించుకోలేవని, ప్రతిపక్షాలు వడ్లు కొంటే రాజకీయం, వడ్లకు పైసలు ఇస్తే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 24గంటల విద్యుత్ తీసుకువచ్చిందన్నారు. రైతులు సిఎం కెసిఆర్‌ను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, రైతులంతా సిఎం కెసిఆర్‌కు అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రమణారెడ్డి, నర్సింలు, దండు సత్తి, వెంకటేష్, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News