సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లోకూర్
న్యూఢిల్లీ : కొలిజియం కన్నా ప్రభుత్వ వైఖరి అనుచితంగా ఉందని, ఈ పద్ధతి మారాల్సి ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ తెలిపారు. దేశంలో న్యాయమూర్తుల ఎంపికలో కొలిజీయంల పాత్ర , ప్రత్యేకించి ప్రభుత్వ వ్యవహారశైలి సరిగ్గా లేదని లోకూర్ అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక విభాగం కీలకమైనదని, జడ్జిల నియామక ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపై ఉందని తెలిపారు. ఇప్పటికైతే ఈ విషయంలో చాలా వరకూ పారదర్శకత లేకుండా ఉందన్నారు.
ఇది కొనసాగితే కష్టం అన్నారు. అంతకు ముందు ఆయన తాము సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కొలిజీయంలో సభ్యులుగా ఉన్నారు. సరైన సంప్రదింపుల ద్వారా కొలిజీయం వ్యవస్థలో సరైన మార్పులు రావాల్సి ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వం ఈ దిశలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. సరైన అర్హత ఉన్న న్యాయమూర్తులకు తగు విధంగా పదోన్నతి అవసరం. ఇది జరగకపోతే ఏర్పాటు ప్రక్రియకే అర్థం లేకుండా పోతుందన్నారు. ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేయకపోవడం సముచితమేనా అనే ప్రశ్నకు మాజీ న్యాయమూర్తి స్పందించారు.