Wednesday, January 22, 2025

ఆసరా, రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సన్నద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటిని పెంచకపోవడంతో వృద్ధులు, మహిళలు, రైతులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి? అనే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది.రైతు భరోసా విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.  ఈ నెల చివరి వరకు ఇంటింటి సర్వే కూడా ముగియనున్నది.  బిసి జనాభా ఎంత మేరకు ఉన్నది అన్న దానిపై క్లారిటీ రానున్నది. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News