Saturday, December 21, 2024

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

బాసర:బాసర మండలంలోని సాలపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. ఒక లక్ష విలువగల చెక్కును ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం లబ్ధ్దిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

ముథోల్ మండలంలోని బ్రహ్మణ్‌గాం బాసర మండలంలోని ఓని గ్రామంలోని లబ్ధ్దిదారులకు , బ్రహ్మణ్‌గాం గ్రామంలోని 30 మంది, ఓని గ్రామంలోని 36 మంది లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఎంపిపి అయేషా అప్రోజ్ ఖాన్, మాజీ పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మగ్దుమ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోర్వశ్యామ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News