Monday, January 20, 2025

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.రేవంత్‌రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఉదయం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని చౌరస్తాలో కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాదవ్‌తో కలిసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తు రైతులను రాజు చేయటానికి నిరంతరం 24 గంటల ఉచితవిద్యుత్తు అందిస్తుంటే రేవంత్‌రెడ్డి రైతుల పట్ల ఉన్న అక్కసును కక్కాడని రేపు అధికారంలోకి వస్తే రైతులను పట్టించుకునే పాపన పోరని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఅర్ అబ్‌కిబార్ కిసా న్ సర్కార్ నినాదం అంటుంటే కాంగ్రెస్ ,బిజెపిలు మాత్రం రైతులను పట్టించుకోక కార్పొరేటర్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నారని అన్నారు.

రైతుల కోరకు కెసిఅర్ సర్కార్ రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం, మల్లనసాగర్, కొండమ్మ పోచమ్మ ప్రాజెక్ట్‌లను నిర్మించి రైతులను రాజులను చేయాలని చూస్తున్నారని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బిజేపిలకు ప్రజలు తగిన బుద్ధ్ది చెప్పాలని అన్నారు.ఈకార్యక్రమంలో మా జీ మార్కెట్ చైర్మన్ జి.నరేందర్‌గౌడ్, మక్కల నర్సింగ్‌రావు,మన్నే ఉదయ్‌యాదవ్,అధ్యక్షుడుఇర్ఫాన్, కార్యదర్శి మేకల హరినాథ్,లలిత, బుర్రియాదగిరి, మట్టి శ్రీనివాస్, జాంగీర్, కమల్, ఉదయరాణి, దుర్గా,రోజా, కమల ,ఉమా, పోచ య్య,సంపత్, శివ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News