నల్లగొండ: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం పాత్లవత్ తండా (టీ)లో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పథకాలు అ మలు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా పాలన కావాలనే గిరిజన బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో గిరిజనుల అస్థిత్వాన్ని గుర్తించి, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిరిజనులపై ప్రేమను, చిత్తశుద్ధిని దాటిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. తండాలను, ఆదివాసి గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతోపాటు వాటన్నిటికీ ఒక్కొక్క జీపీ భవనాలకు 20 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ రాష్ట్రంలోని బంజారాల, ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. వందేళ్ల లో జరగాలిసిన అభివృద్ధి ఈ తొమ్మిది సంవత్సరాల లోనే చేసి చూపెట్టారు అని ఆయన తెలిపారు. గురుకులాలు ఇలా గిరిజనుల సంక్షేమం మనం స్వరాష్ట్రం సిద్ధించాకనే జరిగాయి అని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ లు ఇలా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని వృద్ధుల సంక్షేమం కోసం నిరంతరం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని ఆయన అన్నారు.
గిరిజనుల ఏళ్ల కల నెరవేర్చిన గోప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. నిరంతరం 24గంటలు కరెంట్ అందించిన ఘన ముఖ్యమంత్రి కేసీఆర్ది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పాత్లవత్ పద్మదాస్రు నాయక్, రేపని ఇద్దయ్య, జర్పుల సర్య, రాజ్ కుమార్, ఎటెలి పార్వతయ్య,బొడ్డుపల్లి కృష్ణ, పాత్లవత్ లక్ష్మణ్, కొమ్ము రామస్వామి, బాధ్య నాయక్, కొటేష్, పాండు, ఎంపీడీఓ శర్మ, ఏపిఓ రామచంద్రం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.