Friday, November 22, 2024

గ్రామాల్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గ్రామాల్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగ ంగా దేవరకొండ మండలం కమలాపురం గ్రామంలో రూ.20లక్షల సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు ఘనస్వాగతం పలికారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహార్ధశ పట్టిందన్నారు. గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, వైఎస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు టివిఎన్‌రెడ్డి, స్థానిక సర్ప ంచి రేపాని ఇద్దయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు నేనావత్ శ్రీనునాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడ్డు గోపాల్‌గౌడ్, కశిరెడ్డి రవీందర్‌రెడ్డి, అనుపటి లక్ష్మయ్య, వెంకట్‌రెడ్డి, జైహింద్‌రెడ్డి, లోచనసింగ్, జర్పుల సర్యనాయక్, పరమేష్, శిమర్ల మధు, కోట్యనాయక్, చందునాయక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News