Monday, January 20, 2025

నిరుద్యోగులకు న్యూ ఇయర్ కానుక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం లో కొలువుల జాతర కొనసాగుతూనే ఉం ది. నూతన సంవత్సర వేళ నర్సింగ్ విద్యార్థులకు, రాష్ట్ర యువత కలలను నేరవేర్చే లా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిన్న గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల కా గా, తాజాగా శుక్రవారం ఒకే రోజు రెం డు భారీ నోటిఫికేషన్లను విడుదలయ్యా యి. ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాల భ ర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేవలం రాష్ట్ర పబ్లిక్
సర్వీస్ కమిషన్ 22 నోటిఫికేషన్లల్లో 17,457 పోస్టుల భర్తీని ప్రకటించింది. శుక్రవారం గ్రూప్- 3లో భాగంగా 1365 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి, 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

నర్సుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డిఎంఈ, డిహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5,204 పోస్టులకు స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆర్థిక, వైద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో నియామకాల మేళా కొనసాగుతోంది. 7,320 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టగా, అందులో ఇప్పటికే 969 సిఎఎస్‌లను నియమించారు. స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్ (https://mhsrb.telangana.gov. in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్ 3 పోస్టులకు
జనవరి 24 నుంచి ఆన్‌లైన్‌లో..
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం గ్రూప్- 3 నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్ -2 పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ -1 ప్రిలిమినరీ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.
ఈ ఏడాది 22 నోటిఫికేషన్లు…
మొత్తం 17457 పోస్టులు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది జారీ చేసిన 22 నోటిఫికేషన్లల్లో 17457 పోస్టుల భర్తీకి ప్రకటించింది. వాటిలో ప్రధానంగా గ్రూప్ 1లో 503 పోస్టులు, గ్రూప్ 2లో 783, గ్రూప్ 3లో 1365, గ్రూప్ 4లో 9168 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇంజనీరింగ్ విభాగంలో ఎఈఈ 1540 పోస్టులు, మున్సిపల్ ఎఈ, జూనియర్ టెక్నికల్ అధికారులు 837 పోస్టులు, ఇంటర్మీడియెట్ జూనియర్ అధ్యాపకులు 1392 పోస్టులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు 247 పోస్టులు, పుడ్ సేఫ్టీ అధికారులు 24. అటవీ కళాశాల ప్రొఫెసర్లు 27, సిడిపిఓ 23. ఐసిడిఎస్ గ్రేడ్ 1 సూపర్‌వైజర్లు 181. డిఎఓ (వర్క్) గ్రేడ్ 2లో 53 పోస్టులు, ఎంఎయూడి టౌన్‌ప్లానింగ్‌లో 175. భూగర్భ జలశాఖలో గెజిటెడ్ ఉద్యోగాలు 32 పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు 25, డగ్స్ ఇన్స్‌పెక్టర్ 18 పోస్టులు, పశు సంవర్థక శాఖలో విఎఎస్ 185 పోస్టులు, ఉద్యానవన శాఖలో 22 పోస్టులు, గ్రేడ్ 2 హస్టల్ వెల్పేర్ అధికారులు 581 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 128, వ్యవసాయ శాఖ అధికారులు 148 పోస్టులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News