Wednesday, January 22, 2025

అధికారం అండగా ప్రభుత్వ భూమి కబ్జా..

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూమిపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్నేశారు. కోట్లాది విలువ చేసే భూమిని కబ్జ చేసి తన వశం చేసుకునేందుకు సిద్దమయ్యారు. తన అనుచరులతో భూమిని అంతా జెసిబి ద్వారా శుభ్రం చేసి కంటానైర్ ఏర్పాటు చేసుకున్నారు. అదే భూమిలో విద్యుత్ మీటర్‌ను కూడా తీసుకున్నారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నేత ఈ భూమి పై నజర్ వేసి కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం పక్కనే సర్వే నెంబరు 135లో గతంలో డిడి 1 టవర్‌కు ప్రభుత్వ భూమి కేటాయించారు. ఇటీవల కాలంలో దాన్ని తొలగించడంతోపాటు చుట్టుగా ఉన్న సుమారు 2500 గజాల భూమి పై కన్నెశారు. ఈ భూమి ఖరీదు కోట్లలో ఉండటంతో ఎలాగైన కబ్జా చేసుకోవాలని సిద్దమైనట్లు విమర్శలు వస్తున్నాయి.

నెల రోజులుగా ఈ భూమిని కొద్ది కొద్దిగా చదును చేసి అందులో కంటైనర్ ను ఏర్పాటు చేశారు. దానికి విద్యుత్ మీటర్‌ను కూడా తీసుకోవడం గమనార్హం. పట్టణ నడిబొడ్డున ఉన్న కోట్లాది విలువ చేసే భూమిని కబ్జా చేస్తుంటే సంబంధిత అధికారులు ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేకపోయారు. ఎవరైన ఎక్కడైన ప్రభుత్వ భూములను గజం కబ్జా చేసిన అధికారులు వెంటనే అక్కడ వాలిపోతారు. అమాయక ప్రజలు ఉంటే అధికారులు వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తారు. ఇక్కడ అధికార పార్టీకి చెందిన నేత కోట్లది విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేసినప్పటికి అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News