Monday, December 23, 2024

పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్‌ను ప్రభుత్వం బలి పశువును చేసింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ , నిజాయితీకి మారు పేరైన డా. సబావత్ రాంచందర్‌పై అకారణంగా ప్రభుత్వం బదిలీ వేటు వేసి బలిపశువును చేసిందని బిఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ వేదిక స్పందిస్తూ కేవలం మూడు నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న అధికారిని అందలమెక్కించారనడం సరికాదన్నారు. డా. రాంచందర్ తెలంగాణ తండాలలో జన్మించిన ఒక గిరిజన బిడ్డ కావడమే నేరమా, ఆయన గురించి ఏ ఎమ్మెల్యే, ఏ ఉన్నతాధికారి కూడా నోరు మెదపరని.. అతి నమ్మకంతో చేశారని మండిపడ్డారు.

గొర్రె పిల్లల భకోణంలో కీలక పాత్ర వహించిన మంత్రులను, వాళ్ల ఓఎస్డీలను, ఆనాటి డైరెక్టర్లను ముట్టుకునే దమ్ము మీ కుందా అని నిలదీశారు. రిటైరైనా ఆధిపత్య వర్గాలకు చెందిన అధికారిని ఓఎస్డీగా అదే శాఖకు నియమించి మరీ యధేచ్చగా కుంభకోణం సాగించారు. ఆ అధికారిని సలహాదారుగా ఇంకా కొనసాగిస్తున్నారు. దాన్ని గురించి ఎవరూ మాట్లాడరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గిరిజన వ్యతిరేక కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను మన తండాల్లో, గూడేల్లో, పల్లె ప్రజలకు వివరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News