Friday, November 22, 2024

రూ.30 వేల కోట్లే!

- Advertisement -
- Advertisement -

Government may reduce LIC IPO

ఎల్‌ఐసి ఐపిఒ పరిమాణంలో కోత,  మే 2న రానున్న ఇష్యూ

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) పరిమాణాన్ని ప్రభుత్వం తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఐపిఒ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు దానిని రూ.30,000 కోట్లకు తగ్గించాలనుకుంటోందని సమాచారం. ప్రస్తుతం ఎల్‌ఐసిలో ప్రభుత్వం 100 శాతం వాటాలను కల్గివుంది. మే 2న ఐపిఒ వచ్చే అవకాశముంది. రాయిటర్స్ తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇష్యూ పరిమాణం తగ్గడానికి కార ణం రష్యా-, ఉక్రెయిన్ యుద్ధమే. రాబోయే రెండు వారాల్లో స్టాక్‌ను లిస్ట్ చేయాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ వారంలో ఐపిఒ ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.

ఐపిఒకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చాలా వరకు ముగిసింది. అయితే ఇష్యూ ధరపై యాంకర్ ఇన్వెస్టర్లు తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ వారం సమీక్ష నిర్వహించనున్నారు. 2022 మార్చి నాటికి ఐపిఒ ప్రారంభించాలనేది ప్రభు త్వ ప్రణాళికగా ఉంది. కానీ రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారడంతో ఐపిఒను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ మెరుగుపడడంతో పాటు సెంటిమెంట్లు కొంతమేరకు సానుకూలంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ ఐపిఒ తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో ఎల్‌ఐసిలో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతించడానికి ప్రభుత్వం నిబంధనలను కూడా సవరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News