Thursday, January 23, 2025

దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ వైద్యం రంగం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయని ఇప్పుడు కార్పొరేట్ స్థాయిని మించి ప్రభుత్వ దుకాణాలు, వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రా ష్ట్ర అవతరణ దశాబ్థి ఉత్సవాల్లో భాగంగా వైద్య దినోత్సవం సందర్భంగా కోదాడ గుడుగుంట్ల ఫంక్షన్‌హాల్‌లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్ని ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా వైద్యంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకాన్ని ఆయన గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన వైద్య ఆరోగ్య రంగం గర్బీణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగు అని కేసీఆర్ కిట్‌తో పాటు ప్రసూతి అయిన ఆడబిడ్డలకు 13 వేలు అందజేస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. నాడు సర్కార్ దవాఖానాలు దయనీయ స్థితిలో ఉండేవని నేడు అన్ని వసతులతో నిరుపేద వర్గాలకు ఆరోగ్య భరోసానిస్తుందని తెలిపారు.

డయాలసిస్ సెంటర్ల నుంచి డయాగ్నోస్టిక్ కేంద్రాల వరకు ప్రభుత్వ దవాఖాణాలో ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. ఒకేసారి ప్రభుత్వ రరంగంలో నాలుగు సూ పర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవం అని ఆయన అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ సంకల్పం డాక్టర్ కావాలన్నా విద్యర్థుల కలలను సాకారం చేస్తున్నఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందని ఆయన తెలి పారు. కరోనా కష్ట కాలంలో వైద్య సిబ్బందిని, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడిన తీరు అపూర్వం అని కొనియాడారు. పల్లె, బస్తీ దవాఖానాలను స ద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందకి ఎమ్మెల్యే మెమోంటోలతో, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, కోదాడ ఆస్పత్రిలు, సూపర్డెంట్ నరసింహా, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు, వివిధ ప్రాతమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, సురేష్, లక్ష్మీప్రసన్న, రంజిత్‌రెడ్డి యాదగిరి, డ్టార్ నవ్య, సాంబశివరావు, రజిని, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మమధుసుదన్, సర్పంచులు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, సంధ్యారాణి, నెమ్మాది ప్రకాష్‌బాబు, దేవమణి, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, పట్టణ కౌన్సిలర్లు, గుండెల సూర్యనారాయణ, జ్యోతి శ్రీనివాస్‌యాదవ్, సంపెట ఉపేంధర్, గ్రంథాలయ చైర్మన్ రహీం, యూనియన్ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా లబ్థి పొందిన లబ్ధిదారులు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News