Monday, November 25, 2024

నాన్ వెజ్ ప్రియులకు ప్రభుత్వం తీపి కబురు

- Advertisement -
- Advertisement -

తక్కువ ధరకు నాణ్యమైన మటన్ బిర్యానీ
ఈనెల 12న ప్రారంభించేందుకు ఏర్పాట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: నాన్ వెజ్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తక్కువ ధరలకు నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను అందించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ వంటకాలను వడ్డించనున్నారు. మాసాబ్యాంక్ సమీపంలోని శాంతినగర్లో ఈ నెల 12న ’తెలంగాణ మటన్ క్యాంటీన్’ ప్రారంభం కానుంది. ఇప్పటికే శాంతినగర్ ప్రారంభించిన చేపల క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మటన్ క్యాంటీన్ పై దృష్టి సారించింది.

సిఎం కెసిఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశాలతో క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్ నిర్మించారు. ముందుగా గ్రేటర్‌నగరంలో ప్రారంభించి అనంతరం అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తామని సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిందన్నారు. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 12న మొబైల్ క్యాంటీన్ల ఏర్పాటుకు యోచిస్తున్నామని బాలరాజు వెల్లడించారు. వీటిలో మటన్ బిర్యానీ, కీమా, తలకాయ కూర, మటన్ టిక్కా వంటి అన్ని రకాల పదార్థాలు సరసమైన ధరలకు విక్రయిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News