Monday, December 23, 2024

సెల్ కోసం చెరువు ఖాళీ

- Advertisement -
- Advertisement -

కంకెర్ : తన రూ లక్షాపాతికవేల ఐ ఫోన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రభుత్వ అధికారి జలాశయంలో ఖాళీ చేయించాడు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే రాజేశ్ విశ్వాస్ చర్యతో రిజర్వాయర్‌లోని 21 లక్షలీటర్ల నీరు వృధాపోయింది. పైగా ఈ నీటిని తోడివేసేందుకు అధికారి ఏకంగా రెండు మూడు భారీ మోటార్లను రెండు రోజుల పాటు రంగంలోకి దింపాడు. ఈ అధికారి తన స్నేహితులతో కలిసి ఖేర్‌కట్టా డ్యాం సందర్శనకు వచ్చాడు. ఈ సందర్భంగా సెల్ఫీఫోజులకు వెళ్లగా ఉన్నట్లుండి ఈ విలువైన ఫోన్ రిజర్వాయర్‌లో పడింది. దీనితో ఆయన ముందుగా స్థానిక రెవెన్యూ అధికారితో మాట్లాడి విషయం తెలిపాడు. కేవలం 5 అడుగుల నీటి మట్టం తీసివేయవచ్చునని పై నుంచి అనుమతి రావడంతో ఈ అధికారి ఈ 15 అడుగుల నీటి మట్టం రిజర్వాయర్‌లోని నీటిని అంతటిని తీసివేయించారు.

ఈ ఫోన్‌లో తన శాఖాపరమైన అధికార సమాచారం బాగా ఉందని తెలిపిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విచ్చలవిడిగా సెల్ఫీలకు దిగిన క్రమంలో ఫోన్ జారవిడుచుకున్నట్లు వెల్లడైంది. సోమవారం సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు డీజిల్ పంపులు పనిచేశాయి. రిజర్వాయర్ నీరు వస్తూ ఉండటంతో కంగుతిన్న సంబంధిత సాగునీటి అధికారి ఇక్కడికి చేరుకుని తోడివేతను నిలిపివేయించారు. అయితే అప్పటికే రిజర్వాయర్ దాదాపుగా ఖాళీ అయింది. గురువారం ఈ నీట మునిగిన ఫోన్ పూర్తిగా తడిసిపోవడంతో పనిచేయని స్థితిలో దొరికింది. జరిగిన ఈ వ్యవహారంపై కంకెర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. నీటిని తీసివేయించేందుకు అనుమతిని ఇచ్చిన స్థానిక రెవెన్యూ అధికారికి కూడా నోటీసు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News