Monday, December 23, 2024

విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభుత్వ కార్యాలయాలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ఈ నెల 2 నుంచి రోజుకు ఒక శాఖ వారు దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య, వ్యవసాయ శాఖ, పోలీస్, ఆరోగ్య, నీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నేడు మంచినీటి పండుగ ఇలా ప్రతి శాఖలు ఈ నెల 22వ తేది వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.

నియోజకవర్గంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్స వాలు అంబరాన్ని తాకేలా కొనసాగుతున్నాయి. అన్ని శాఖల కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జై పాల్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, ప్రజలు మమేకమై దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ దేమైనా దశాబ్ది ఉత్సవాలు పట్టణ, మండల కేంద్రాల్లో జోరుగా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News