Friday, December 20, 2024

ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ఈనెల 24 జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం నూతన సమీకృత నూతన కలెక్టర్ భ వన నిర్మాణ పనులతో పాటు సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ కార్యాలయాల పనులు, ఏర్పాట్లను అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల వారణంలో పూల, వివిధ రకాల మొక్కలతో ఆవరణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను సూ చించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూరగాయల పెట్టుకోని విక్రయించే ప్రాంతాలను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డిని సూచించారు. అనంతరం సూర్యాపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం, డీటీవో కార్యాలయాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సెక్షన్ల వారిగా ఉన్న గదులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ట్రెజరరి కార్యాలయంలో ఫర్నిచర్, ఫైల్స్, బిల్లులను క్రమ బద్దతిలో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో మార్చుకోవాలని డీటివో రవి కుమార్‌కు సూచించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News