Monday, December 23, 2024

ప్రభుత్వ అధికారులు నిర్లక్ష ధోరణి విడనాడాలి

- Advertisement -
- Advertisement -
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక: దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు నిర్లక్ష ధోరణి విడనాడాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించి మార్కెట్ ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డులో గత రెండు నెలల క్రితం గాలి వానకి ఎగిరిపోయిన గోదాములపై కప్పు రేకులను ఇప్పటి వరకు మరమ్మతు చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు.

నెల రోజులుగా ధాన్యం కొనుగోలుపై సమీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం క్షేత్రస్థ్ధాయిలో ఉన్న సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల నేడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో సోమవారం రాత్రి కురిసిన ఆకాల వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర అందోళన చెందుతున్నారన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్షకు మొదటి ప్రాదాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

గత వారం రోజులుగా దుబ్బాక పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాములను మరమ్మతు చేయాలని అధికారులు సూచిస్తున్న పెడ చెవిన పెడుతున్నారని 24 గంటల్లో రేకులను మరమ్మత్తు చేసి అధికారుల నిర్లక్ష ధోరణి విడనాడాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. రెండు నెలల క్రితం వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం వెంటనే అందించాలన్నారు. దాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెంట వెంటనే వేయాలన్నారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటి సిబ్బంది. బిజెపి నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News