Sunday, December 22, 2024

రెవెన్యూ డివిజన్‌గా చండూరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రెవెన్యూ డివిజన్‌తో పాటు మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ చండూరును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రభుత్వం చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేసిందిల చేసింది. కాగా, ప్రస్తుతం చండూరు మండలం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా ఉంది.

ఇప్పుడు ప్రభుత్వం చండూరును నూతన రెవెన్యూ డివిజన్‌గా మార్చడంతో అందులో నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండ లాలను, దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుతూ ఈ నూతన డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరాలను సమర్పించేందుకు ప్రభుత్వం 15 రోజులు గడువు ఇచ్చింది.
సోనాలా మండలం ఏర్పాటుకు తుది నోటిఫికేషన్
ఆదిలాబాద్ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోనాలా మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News