Thursday, January 23, 2025

వచ్చే ఐదేళ్లలో పిజి మెడికల్ సీట్లను రెట్టింపు చేయాలనుకుంటున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

 

PG Medical seats

న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంబిబిఎస్ వైద్యుల సంఖ్య ఎక్కువగా ఉంటోందన్న ఆందోళనల మధ్య, వచ్చే ఐదేళ్లలో వైద్యరంగంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ (పిజి) సీట్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ చర్య దేశంలో ప్రత్యేకించి చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను పరిష్కరిస్తుంది , ఎక్కువ మంది ఎంబిబిఎస్ వైద్యులు పిజి సీటును పొందడంలో సహాయపడుతుంది. ఈ ప్రణాళిక ప్రకారం, మెడిసిన్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలకు (ఎంఎస్ మరియు ఎండి) సమానమైన డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డిఎన్ బి) సీట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం చూస్తోంది, కొత్త సీట్లను సృష్టించగల సౌకర్యాలను గుర్తించి, ఎంఎస్/ఎండి సీట్లకు నిబంధనలను సడలించాలని చూస్తోంది.

2022-23 అకాడమిక్ సెషన్‌కు, భారతదేశంలోని వైద్య కళాశాలల్లో 91,927 ఎంబిబిఎస్ సీట్లు ఆఫర్‌లో ఉన్నాయి, అయితే  మాస్టర్ ఆఫ్ సర్జరీ/ డాక్టర్ ఆఫ్ మెడిసిన్( ఎంఎస్/ఎండి) సీట్లు 46,118, అంటే ఎంబిబిఎస్ సీట్లలో సగం మాత్రమే. ఇంత వరకు బాగానే ఉంది. ఎంఎస్/ఎండి చేశాక ఏడాదిపాటు ‘రూరల్ సర్వీస్’ చేయాలన్న నిబంధన కర్నాటకలో ఉంది. కానీ అక్కడ ఇప్పటికీ ఎంఎస్/ఎండి ఈ ఏడాది పూర్తి చేసిన అందరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. కేవలం ఓ 20 శాతం లోపు మందిని మాత్రమే తీసుకున్నారు.  పైగా అక్కడి విద్యార్థులు ఏమి అర్థం కాక అయోమయంలో ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పోని నిబంధనను రద్దు చేస్తారా అంటే అదీ లేదు. కేవలం సీట్లు పెంచినంత మాత్రాన సరిపోదు. ముందస్తుగా స్పష్టత(క్లారిటీ) ఉండాలని చాలా మంది వాదిస్తున్నారు.

2020-21 గ్రామీణ ఆరోగ్య గణాంకాల ప్రకారం, మార్చి 31, 2021 నాటికి, గ్రామీణ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కేవలం 4,405 మంది నిపుణులు మాత్రమే ఉన్నారు, 21,924 మంది కంటే 80 శాతం తక్కువ. ప్రయివేటు రంగంలో కూడా ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఈ అసమానతను పరిష్కరించడానికి మెడిసిన్‌లో పిజి సీట్ల సంఖ్యను పెంచడం చాలా కీలకమని ఇతర ఆరోగ్య నిపుణులు కూడా భావిస్తున్నారు. కానీ అందరినీ సర్వీసులోకి తీసుకుంటారా లేక సందిగ్ధంలో ఉంచుతారా అన్నది కూడా అధికారులు గమనించాలి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News