Monday, January 20, 2025

విద్యారంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మానవపాడు : మండల పరి ధిలోని మద్దూరు గ్రామంలో రూ. 17 లక్షలతో , అమరవాయి గ్రామంలో రూ. 9.14 లక్షలతో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అ భివృద్ధ్ది పనుల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. మన ఊరు మన బడి పాఠశాల భవన ంను ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విద్యకు సరైన ప్రాధాన్యత కల్పించలేకపోయారని, ఈ ప్రాంతం నుండి విద్యార్థులు కర్నూలు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించేవారని నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త ర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో విద్యారంగానికి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద న్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఎస్సీ, ఎస్టీ, బీసీ 119 మైనార్టీ గురుకులాలను స్థాపించి, కార్పోరేట్ స్థాయిలో వసతులతో, నాణ్యమై న విద్యను పౌష్టికాహారంతో, కెజి టూ పిజి ఉచిత విద్య అందించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బి. కాంతారెడ్డి, ఎంపిటిసి రోషన్న, మండల ప్రధాన కార్యదర్శి డా.పి. హుస్సెన్, మండల విద్యాధికారి శివప్రసాద్, పంచాయతీ కార్యద ర్శి ఆశోక్, ఉపా ధ్యాయులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఫీల్డ్ అసిస్టెంట్ మోదిన్ , ఎంకన్న, ప్రసాద్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News