Monday, November 18, 2024

మొబైల్, టీవీలు ఇకపై చౌక..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి శుభవార్త. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని 19 శాతం వరకు తగ్గించింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లతో సహా అనేక గృహోపకరణాలు చౌకగా మారాయి. జిఎస్‌టి 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై జిఎస్‌టిని 19 శాతం వరకు తగ్గించింది. ఇకపై కొత్త ఫోన్ లేదా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారు 3 నుండి 19 శాతం తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశముంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ద్వారా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసింది.

ఫోన్‌లపై జిఎస్‌టి 19.3% తగ్గింపు
జిఎస్‌టి కొత్త రేటు ప్రకారం, భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లపై జిఎస్‌టిని 19.3 శాతం వరకు తగ్గించింది. గతంలో మొబైల్ ఫోన్ కొనుగోలుపై 31.3 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 12 శాతం జిఎస్‌టిని చెల్లించాల్సి వస్తోంది. అదే సమయంలో మొబైల్ ఫోన్ తయారీదారులు కూడా ధరను తగ్గించవచ్చు.

చౌకగా మారనున్న టీవీలు
తక్కువ సైజు ఉన్న టీవీలు చౌకగా మారనున్నాయి. ఇంతకు ముందు ప్రజలు ఏ రకమైన టీవీని కొనుగోలు చేసినా 31.3 శాతం జిఎస్‌టి చెల్లించారు. ఇప్పుడు జిఎస్‌టి కొత్త రేటు ప్రకారం, 27 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ సైజు ఉన్న టీవీని కొనుగోలు చేస్తే 18 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది.అదే సమయంలో 32 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీలపై విధించే జిఎస్‌టిలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే చాలా కంపెనీలు 32 అంగుళా టీవీలనే తయారు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలు టీవీల విషయంలో తక్కువగానే ఊరట పొందనన్నారు.

గృహోపకరణాలపై 13.3 తగ్గింపు
ఇక గృహోపకరణాల విషయానికొస్తే, గీజర్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సర్లు, జ్యూసర్లు, వాక్యూమ్ క్లీనర్లు వంటివి ఉంటాయి. వీటికి జిఎస్‌టి 13.3 శాతం తగ్గనుంది. ఇప్పుడు ప్రజలు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 12 శాతం జిఎస్‌టి చెల్లించాలి. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై 31.3 శాతం జిఎస్‌టి చెల్లించాల్సి వచ్చేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News