Wednesday, December 25, 2024

బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. భారత్‌లో ఈ విలువైన లోహం దిగుమతులు ఎక్కువగా జరుగుతాయి. వీటి దిగుమతులను కొంతమేరకు అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల దిగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది కొన్ని అనవసరమైన వస్తువుల దిగుమతిని నిషేధించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దిగుమతిదారులు బంగారు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నుండి లైసెన్స్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య విధానంలో కొన్ని లోపాలను తొలగించడానికి కేంద్రం ఈ నిబంధనలను తీసుకువచ్చింది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఉత్పత్తుల దిగుమతి విధానాన్ని తక్షణమే అమలులోకి వచ్చేలా స్వేచ్ఛా వాణిజ్యం నుండి నియంత్రిత కేటగిరీకి సవరించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది.ఇండోనేషియా నుంచి సాదా బంగారు ఆభరణాలను తెప్పించే ప్రక్రియ కొంతకాలంగా జరుగుతోంది. వీటికి దిగుమతి పన్ను చెల్లించకపోవడమే ఈ చర్య తీసుకోవడం వెనుక కారణంగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇండోనేషియా నుండి దిగుమతిదారులు 3-4 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నారని, దానిపై ఎటువంటి పన్ను చెల్లించలేదని ముంబైలోని ఒక డీలర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News