Friday, December 27, 2024

రెవెన్యూ శాఖ బలోపేతంగా ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు

- Advertisement -
- Advertisement -

విఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని
మంత్రి పొంగులేటి కలిసిన వీఆర్వో జెఎసి ప్రతినిధి బృందం

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖ బలోపేతం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను పూర్తి స్దాయిలో అమలు చేయవచ్చని గ్రామ రెవెన్యూ అధికారుల జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. బుధవారం ఆసంఘం చైర్మన్ గోల్కొండ సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి క్వార్టర్స్‌లో కలిసి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ద్వారా రద్దయిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకుంటే గ్రామ పరిపాలన ద్వారా సంక్షేమ పథకాలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ సమక్షంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

అనంతరం ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వీఆర్వో వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన కుంటుపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రద్దయిన వీఆర్వోలను శాఖలోకి తీసుకోవాలని కోరుతూ రద్దుకు సంబంధించిన జీవో నెంబర్ 121ని రద్దుపరిచి యధావిధిగా వ్యవస్థను కొనసాగించే విధంగా కృషి చేయాలని కోరారు. వీరి సమస్యలకు స్పందించి పొంగులేటి రాష్ట్ర ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలు చేరాలంటే రాష్ట్ర అభివృద్ధి రెవెన్యూ శాఖ ద్వారానే సాధ్యమవుతుందని, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో సాధ్యపడుతుందని, ఉద్యోగులు లేని ప్రభుత్వం ఉండదన్నారు. అతి త్వరలో సంబంధిత సంఘం నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని వారికి హమీ ఇచ్చినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో వీఆర్వోల జెఎసి నాయకులు పల్లెపాటి నరేష్ , చింతా మురళి, ప్రతిభ , శ్రీహరి నాయశేఖర్, మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News