Wednesday, January 22, 2025

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

- Advertisement -
- Advertisement -

యాచారం: బిఆర్‌ఎస్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు కశ్రమోని పద్మమల్లేష్‌యాదవ్,ఇబ్రహీంపట్నం కౌన్సిలర్, ఎన్ కుమార్ సీనియర్ నాయకులు పి.మహేష్‌లు సూచించారు.

ఆదివారం మండలంలోని అయ్యవారి గూడ లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశా రు. బిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు వనం కిరణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బాణావత్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నిరంతరం పాటుపడుతున్నారని వేల కోట్ల నిధులతో నాలుగు మండలాలలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.కార్యక్రమంలో పార్టీ ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు మండలి గోపాల్,1వ వార్డు సభ్యులు కొప్పు బుగ్గ రాములు,గ్రామశాఖ ఉపాధ్యక్షులు పి,రమేశ్,యూత్ అధ్యక్షులు సాటురాజు,ఉపాధ్యక్షులు పసుపుల శివరాజు, పార్టీ సీనియర్ నాయకులు కె.పాండు,కొప్పు నరేష్, నర్సి ంహ్మ, జంగయ్య,గణేష్,రాములు,కె.వెంకటేష్,నక్క వెంకటేష్‌యాదవ్,సంజీవ,మల్లయ్య, నారయ్య, అంజయ్య,వెంకటమ్మ, చమ్మ,అంజమ్మ,సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News