- Advertisement -
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జులపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ స్క్రూటిని, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎఐసిసి ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఎఐసిసి సెక్రెటరీ విస్ణునాథ్, తదితరలు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేసే అంశంపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సిఎం సూచించారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -