Sunday, December 22, 2024

ప్రతి కుటుంబానికి చేరువైన ప్రభుత్వ పథకాలు

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం వలన ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఇంతకంటే మనకు కావల్సింది ఏముందని ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో బిఆర్‌ఎస్ మండల, కమలాపురం గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్మించిన పార్టీ దిమ్మెను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగుర వేశారు. ఎంఎల్‌ఎ కమలాపురం గ్రామానికి చేరుకోగానే బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, ఎంపిపి మట్ల నాగమణి, సర్పంచ్ గొల్ల పెంటయ్య, బిఆర్‌ఎస్ గ్రామ కమిటీ నాయకులు గొల్ల నారాయణ, ఊరబెద్ది వెంకన్న, బాల అప్పారావు, ఆధ్వర్యంలో గ్రామస్తులు పూల వర్షంతో ఘనస్వాగతం పలికి గ్రామంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ముఖ్యమంత్రి చిత్ర పటానికి ఎంఎల్‌ఎతో పాటు పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ తాను ఎంఎల్‌ఎగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో కమలాపురం చుట్టూ ఉన్న మూడు వాగులపై బ్రిడ్జీల నిర్మాణానికి 4 కోట్ల రూపాయిలు విడుదల చేయించి పనులు ప్రారంభించామన్నారు. త్వరలో మండలంలోని పలు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బిఆర్‌ఎస్ మండల నాయకులు గొల్ల నారాయణ కుమారుడు గొల్ల వీరభద్రంను పరామర్శించి ఎలాంటి సహాయం కావల్సినా చేస్తానని భరోసా ఇచ్చారు.

కమలాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధికి కోట్ల రూపాయిలను మంజూరు చేసిన ఎంఎల్‌ఎను ఎంపిపి మట్ల నాగమణి ఆధ్వర్యంలో గ్రామస్తులు, పార్టీ నాయకులు శాలువుతో ఘనంగా సత్కరించారు. ఇదే సందర్భంలో దమ్మపేట జడ్‌పిటిసి పైడి వెంకటేశ్వరరావును కూడా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శనగపాటి మెహర్మణి, సర్పంచ్‌లు కారం సుధీర్, గడ్డం భవాణి, వాడే నాగరాజు, బైటి రాజేష్, బిఆర్‌ఎస్ మండల నాయకులు పర్వతనేని అమర్‌నాథ్, పువ్వాల మంగపతి, శనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, బిక్కుమళ్ళ సుదాకర్, కొండవీటి రాజారావు, పుష్పాల చందర్‌రావు, నందమూరి సురేష్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News