Monday, December 23, 2024

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంగళవారం విద్య దినోత్సవం మండలంలోని చిన్న వెంకటగిరి, నాయుడుపేట, దానవాయిగూడెం, మల్లెమడుగు, రామన్నపేట 59 వ డివిజన్, మంగళ గూడెం గ్రామాల పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా విసృ్తతంగా పర్యటించారు. చిన్న వెంకటగిరి పాఠశాలలో మన ఊరు – మన బడి పథకంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో కాసేపు కూర్చొని బాల్యంలో గడిపిన రోజులు గుర్తు చేసుకున్నారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్‌లను అందించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బలోపేతం అవడం జరిగిందని, ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలు తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పిస్తూ వారిని తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే పథకాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సద్విని చేసుకొని మంచి ఫలితాలు సాధించి, ప్రభుత్వ పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్‌కు దీటుగా ఇంగ్లీష్ మీడియం కూడా అందించడం జరుగుతుందని, క్వాలిఫై టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధనలు చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలన్నారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ బడులంటే శిదిలామైన భవనాలు ఉండేవని కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నూతన భవనాలు నాణ్యమైన విద్యతో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య విధానమును అమలు చేస్తూ విద్యార్థులలో సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు పాఠశాల భవనాలు తరగతి గదులు ఆకర్షణీయంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారని ఇలా అన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై మరింత ఆసక్తి పెంచుతాయన్నారు. మన ఊరు మన బడి కి ఎంపికైన పాఠశాలలో ఇప్పటికే విద్యార్థులు కూర్చునేందుకు బళ్లాలు విద్యుదీకరణ, డ్యూయల్ డెస్క్‌లు, బెంచ్ లు డిజిటల్ స్మార్ట్ క్లాసులు, పరికరాలు, గ్రీన్ చాక్ పీస్ బోర్డులు, ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చాయన్నారు.

సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు నేటి సమాజానికి ఉపయోగపడడమే కాకుండా బావి తరాలను తీర్చి దిద్దడానికి ఉపయోగించుకోవాలని విధాన నిర్ణయం తీసుకున్నదన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు పరిమితమైన డిజిటల్ పాఠాలనుప్రతి ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. దీంతో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు రానున్న రోజుల్లో పూర్తిగా మారిపోతాయన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, రూరల్ మండలం ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, ఎంఈఓ శాంసన్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గుడిబోయిన దర్గయ్య, కార్పొరేటర్లు బట్టపోతుల లలిత రాణి, నిరంజన్, ఎదులాపురం సొసైటీ చైర్మన్ జరుపుల లక్ష్మణ్ నాయక్, మారెమ్మ గుడి చైర్మన్ మట్ట వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News