Monday, December 23, 2024

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

కొండాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చదువుకు పెద్దపీట వేస్తోందని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్‌లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాలలో 32లక్షల నిధులతో నిర్మించిన ప్రహారీ గోడ, వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ భాగ్యవతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యంతో కలిసి ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పాలనలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లో ఇంగ్లీష్ పాఠాలు చెప్పేవారని, స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభమయ్యాయన్నారు. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎంపిపి మనోజ్‌రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు విజయ భాస్కర్‌రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాస్‌గౌడ్, రైతు బంధు మండల అధ్యక్షుడు మల్లేశం, తహశీల్దార్ ఆశజ్యోతి, ఎంపిడిఓ జయలక్ష్మి,ఎంఇఓ భీంసింగ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విఠల్, మాజీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ పవన్, నాయకులు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రేమానందం, జగదీశ్, రమేష్, వీరేశం తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News