Thursday, January 23, 2025

సకల హంగులతో ప్రభుత్వ పాఠశాలలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశ గా సకల హంగులతో సర్వాంగ సుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందని, విద్యార్థులకు సమగ్ర విద్యాబోధన అందించాలని నాగర్‌కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి అన్నా రు. మంగళవారం తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాలలో మ న ఊరు మన బడి కార్యక్రమం కింద కోటి 29 లక్ష ల రూపాయలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలను ఎమ్మె ల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానికంగా గ్రామాల లో ప్రొసెస్సింగ్, రైస్ మిల్లులు నెలకొల్పడానికి నిర్ణ యం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రైస్ మిల్లుల స్థాపనలో గ్రా మీణ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు అందుతాయన్నారు. అర్హులైన లబ్ధ్దిదారులకు రైతు బంధు, దళిత బంధు, గృహలక్ష్మి పథకాలను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది నిధులు ఖ ర్చు చేస్తుందని అన్నారు.

కార్పొరేట్ స్థాయిలో ప్ర భుత్వ బడులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మంచి విద్యనభ్యసించి ఉన్నత పదవులలో నిలవాలని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఊరు మన బడి కార్యక్ర మం కింద చేపట్టి పూర్తైన పనులకు ప్రారంభోత్సవా లు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జి ల్లాలో మన ఊరు మన బడి మొదటి దశలో 290 పాఠశాలల్లో సుమారు 124 కోట్లతో మౌళిక సదుపాయాలు, ప్రహారీ గోడ, వంట గదుల నిర్మాణాల పనులు చేపట్టడం జరిగిందని, రెండవ దశలో మరి న్ని పాఠశాలల్లో పనులు చేపడుతామని తెలిపారు.

విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అ ందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలా గే మధ్యాహ్న భోజనం పథకం కింద పౌష్టికాహారం అందించాలని అన్నారు. అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ అందించాలని, తద్వారా విద్యార్థులు చురుకుదనంతో పాటు ఆరోగ్యవంత ంగా ఉంటారని అన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తిమ్మాజిపేట, తాడూరు, సిర్సవాడ, కు మ్మెర పాఠశాలలను సొంత నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని, మన ఊరు మన బడి నిధులతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తు కు విద్య నాంది అని, విద్యార్థులు ఉన్నత చదువు లు అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాల ని అన్నారు.

అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం కింద రాగిజావను పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ హనుమంతు, ఎంపిపి రవీంద్రనాథ్ రెడ్డి, నూరుద్దీన్, ఎం పిడిఓ కరుణ శ్రీ, ఎంఈఓ శ్రీనివాసులు, ఎఫ్‌ఎల్‌ఎన్ నోడల్ అధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News