Thursday, December 19, 2024

పేదలందరికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

ములుగు  : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికి పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములుగు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దయెత్తున ధర్నా నిర్వహించారు. అంతకుముందు డిఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్ నుండి కలెక్టరేట్, జాతీయ రహదారిపై భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎండి అంజద్ పాషా అధ్యక్షతన జరిగిన ధర్నాలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికి డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ వాగ్ధానం అమలుకు నోచుకోక స్వంత ఇంటి స్థలం లేని నిరుపేదలు ప్రభుత్వంపై ఆశతో ఏళ్ల తరబడి ఎదురుచూసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారన్నారు. రాష్ట్రంలో 65 కేంద్రాలలో సుమారు లక్ష మందికి పైగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలన్నారు.

వెంటనే సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్‌పాషా, సిఐటియూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News