Thursday, January 23, 2025

ప్రభుత్వం గీత వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గీత వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నిధులను, వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని తెలం గాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. చెట్టుపై నుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుం బాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ. 5 లక్షల నుంచి పది లక్షల పెంచాలని, గాయపడిన వారికి చెల్లించే మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని కోరారు. గీత కార్మికుల పెన్షన్ రూ. 2016 నుండి రూ 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులోని గీత పని వారల సంఘం రాష్ట్ర కార్యాలయం ధర్మ బిక్షం భవన్ లో జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన ప్రసంగించారు. హరితహారంలో తాటి, ఈత వనపెంపకాన్ని హర్షిస్తూ, కల్లు గీత సహకార సంఘాలన్నిటికీ వన పెంపకానికి ప్రభుత్వం జీవో ప్రకారం కేటాయించి 5 ఎకరాల నుండి 10 ఎకరాలకు పెంచి, విధిగా భూమి కేటాయించాలన్నారు. నీరా పథకాన్ని కల్లుగీత సహకార సంఘాల ద్వారా కల్లుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులు రద్దు, వృత్తిదారులకు ఇళ్ల స్థలాలు, గృహ, విద్యా , వైద్య పథకాలను అమలు చేయా లన్నారు. మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ అమలు కాలేదని, ఈ మేరకు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో గీత వృత్తి-దాని భవిష్యత్తుపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజీ సాయిల్ గౌడ్ మాట్లాడుతూ గీత వృతదారులకు పెండింగ్ లైసెన్సులు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర సమన్వయ కార్యదర్శి బొమ్మగాని నాగభూషణం, జిల్లాల నాయకులు పబ్బు వీరస్వామి, మారగొని ప్రవీణ్ కుమార్, రేగట్టి లింగయ్య, దొంతు రామ్మూర్తి, ఎం సుధాకర్ గౌడ్, బి తిరుపతి గౌడ్, డిజీ నరేంద్ర ప్రసాద్, బుడిగి సైదులు, ఈ యాదయ్య గౌడ్, నిరంజన్ గౌడ్, పబ్బు యాదయ్య, చాపల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News