Monday, January 20, 2025

మిల్లింగ్ వేగవంతానికి ప్రభుత్వం చర్యలు

- Advertisement -
- Advertisement -
సటాకే కార్పోరేషన్ ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ళలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో పదిరెట్లు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, దానిని సద్వినియోగపరుస్తూ తెలంగాణ బ్రాండ్ క్రియోట్ చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శుక్రవారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మిల్లింగ్ పరిశ్రమల స్థాపనపై జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ సటాకే కార్పోరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్బావ సమయంలో ఉన్న 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి ఏటికేడు దిగుబడి పెరుగుతూ ఈ సీజన్‌లో 1.30 లక్షల టన్నులను కేవలం పౌరసరఫరాల శాఖ ద్వారానే సేకరించామని, ఇదే స్థాయిలో బహిరంగ మార్కెట్లోకి సైతం ధాన్యం తరలుతుందన్నారు, ఇంత పెద్ద స్థాయిలో వస్తున్న ధాన్యం ఉత్పత్తికి మరింత మద్దతు అందజేస్తూ వేగంగా మిల్లింగ్ చేయడంతో పాటు ఉప ఉత్పత్తులను సైతం నాణ్యమైన మార్కెంటింగ్ చేసేవిదంగా రైతుల ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి చేర్చడమే సీఎం కెసిఆర్ సంకల్పమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తులు తగ్గుతుంటే కేవలం తెలంగాణలో మాత్రమే పెరుగుతుందని దీన్ని సద్వినియోగం చేసుకొనే దిశలో ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయని తెలిపారు. అనంతరం సటాకే కార్పోరేషన్ జపాన్ కంపెనీ ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మంత్రికి వివరించారు, ప్రపంచవ్యాప్తంగా యూఎస్, యూకే, థాయ్ లాండ్, చైనా, వియత్నాం తదితర వరి పండించే దేశాల్లో తమ కంపెనీ మిల్లింగ్ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. అత్యధికంగా రోజుకు లక్ష టన్నుల వరకూ మిల్లింగ్ సామర్థ్యం ఉందన్నారు. ఈ సందర్భంగా మిల్లింగ్ తో పాటు నిల్వ సామర్థ్యం, బ్రాయిలర్ల పనితీరు, ఉప ఉత్పత్తులు తదితర అన్ని అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వి. అనిల్ కుమార్, జపాన్ సటాకే కార్పోరేషన్ డైరెక్టర్ ఆర్.కె.బజాజ్, ఎజీఎం హెచ్.సతీష్ కుమార్, డీలర్లు కె.విఠల్, కె. వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News