Thursday, November 7, 2024

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

- Advertisement -
- Advertisement -

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు సచివాలయంలో కొత్త రోడ్ల నిర్మాణం పనులను సైతం ప్రభుత్వం చేపట్టింది. ఆర్ అండ్ బి దీనికి సంబంధించి టెండర్‌లను సైతం పిలిచింది. అయితే ఈ రోడ్లతో పాటు మరో గేటు ఏర్పాటుకు ఆర్ అండ్ బి ఈ టెండర్‌లను పిలిచినట్టుగా తెలిసింది. రోడ్లు, గేట్, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సుమారుగా రూ.3 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం నార్త్‌ఈస్ట్ గేటు వైపు నుంచి సిఎం రాకపోకలు సాగిస్తుండగా ప్రస్తుతం మరో గేటును అదే వైపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ఇప్పటికే సచివాలయం ముఖద్వారం వైపున ఉన్న గేట్‌ను మూసివేసిన అధికారులు దాని ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ విగ్రహంతో పాటు ఫౌంటెన్, లాన్ పనులను కూడా చేపట్టనున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో పలు మార్పులు, చేర్పులు చేయడంతో పాటు ప్రస్తుతం ప్రధాన ద్వారం ఇరువైపులా రోడ్ల నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. అందులో భాగంగా నాలుగు వైపులా ఉన్న నాలుగు గేట్లకు తోడు మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News