Monday, December 23, 2024

ఎస్‌టిల అభ్యన్నతికి ప్రభుత్వం చేయూత

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

కొండాపూర్: అడవుల్లో ఉండే తాండాలను నేడు గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్ది అడవిలో ఉన్న గిరిజనులను అభివృద్ధి బాట పట్టించిన ఘనత సిఎం కెసీఆర్‌దని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శనివారం కొండాపూర్ మండల పరిధిలోని తమ్మళిబాయి తాండాలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ పండగలో భాగంగా 20లక్షల రుపాయలతో పంచాయతీ భవన నిర్మాణం పనులకు సర్పంచ్ శాంతి భాయ్‌తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిసిబి వైస్ చైరన్ పట్నం మాణిక్యంతో కలిసి ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేస్తుందన్నారు.

గత ప్రభుత్వాలు గిరిజన తాండాలను పట్టించుకోక పోవడంతో చీకట్లో ఉండ ఆదివాసీలు నేడు సిఎం కెసిఆర్ పాలనలో అభివృద్ధి బాటపట్టారన్నారు. బిఆర్‌ఎస్ 500ల జనాభా కలిగిన గిరిజన పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసిందన్నారు. ఎస్‌టిల అభ్యన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. గిరిజన విద్యార్థుకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారన్నారు. ఎస్‌టి విద్యార్థుల కోసం న్యాయ, సైన్స్ ఆర్ట్, సైనిక్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, ఎంపిపి మనోజ్‌రెడ్డి, ఎంపిడిఓ జయలక్ష్మి, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పాండురంగం, సొసైటీ చైర్మెన్ ఎల్.శ్రీకాంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి, నాయకులు మాణిక్‌ప్రభు, ప్రేమానందం, అర్జున్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి శాంతి ప్రియ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News