Tuesday, January 21, 2025

అక్కాచెల్లెల జీవనోపాధికి ప్రభుత్వం తోడ్పాటు

- Advertisement -
- Advertisement -
  • 70 గ్రామాల్లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల ఏర్పాటు
  • ప్రతి సెంటర్‌కు 50 మంది చొప్పున 3,500 మందికి గ్రామాల్లో ఉచిత శిక్షణ
  • అర్హులైన మహిళలను గుర్తించాలని ఏపీఎంలకు ఎమ్మెల్యే సూచనలు
  • స్కిల్స్ ఉన్న వారికి వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో అవకాశాలు
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట: మహిళల అభివృద్ధికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 70 గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఉచిత కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాల ఏర్పాటు వాటి పనితీరు, అభ్యర్థుల ఎంపిక లాంటి పలు అంశాలపై 6 మండలాల ఐకేపీ సంస్థ ఏపీఎంలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేటలోని బీపీఎల్ కింద ఉన్న అక్కాచెల్లెల్ల జీవనోపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని సీఎం కేసీఆర్‌ని కోరగా ఆయన పెద్ద మనస్సుతో నియోజకవర్గంలోని 70 గ్రామాల్లో కుట్టు మిషన్ కేంద్రాలను మంజూరు చేశారు.

ప్రతీ సెంటర్‌కు 50 మంది చొప్పున మొత్తం 3500 మందికి సొంత గ్రామాల్లో ఉచిత శిక్షణతోపాటు ప్రతీ ఒక్కరికీ ఐఎస్‌ఐ ముద్ర గల కుట్టు మిషన్లను ఉచితంగా అందచేస్తారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెట్‌విన్, నాక్ ద్వారా అందిస్తారు. ఈ శిక్షణ 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి లేబర్ కార్డు కలిగిన అక్కా చెల్లెలందరూ అర్హులు. ఐకేపీ వారు ప్రతీ మండలానికి 10 సెంటర్లను గుర్తించి వీఓఏలు, సీఏల సమన్వయంతో అర్హులైన మహిళలందరినీ గుర్తించి రెండు రోజుల్లోకి జాబితాను సిద్ధం చేయాలని కోరారు.

శిక్షణ పూర్తయిన తరువాత ఉచిత కుట్టు మిషన్‌తోపాటు స్కిల్స్ ఉన్న వారికి వరంగల్ గీసుకొండ మండలంలోని టెక్స్‌టైల్ పార్క్ నందు ఉన్న ఎంఎన్‌సీ కంపనీల్లో ఉపాధి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రాజెక్టును మన నర్సంపేట నియోజవర్గానికి తీసుకరావడం జరిగింది. లేబర్ యాక్ట్‌కి అనుగుణంగా కంపనీల్లో ఉపాధి పొందిన మహిళలందరికీ వారి ఊరు నుంచి పనిచేసే స్థలం వరకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన నెలకు రూ. 12 నుంచి 15 వేల వరకు జీతాన్ని ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. పై సమీక్షా సమావేశంలో నియోజకవర్గ ఆరు మండలాల ఏపీఎంలు, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, దుగ్గొండి మండల క్లస్టర్ బాధ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News