Sunday, January 19, 2025

కులవృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వ సహకారం

- Advertisement -
- Advertisement -

బిసిల అభ్యున్నతి కోసం కెసిఆర్ కృషి
ఎమ్మెల్సీ మధుసూదనాచారి
ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ కులస్తుల పాలాభిషేకం

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ తర్వాతే కులవృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని విశ్వబ్రాహ్మణ నాయకులు అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బిసిల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయానికి విశ్వబ్రాహ్మణులు ధన్యవాదాలు తెలిపారు.

ఉప్పల్ భగాయత్‌లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ కులస్తులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలుసన్నారు. భవిష్యత్‌లో కూడా వారి అభివృద్ధికి మరింత చేయూత లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి దూరదృష్టితోనే ఆర్థికసాయం అమలు: జూలూరి

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ కులవృత్తులు చేసుకునే వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి దూరదృష్టితో రూ. లక్ష ఆర్థికసాయాన్ని పెట్టారన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత చేనేత కార్మికులు, విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మహత్యలు కనుమరుగయ్యాయన్నారు. కులవృత్తులు చేసుకునే వారికి ఆర్థికసాయం చేసి ఆదుకుంటున్న కెసిఆర్‌కు జూలూరు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు లాల్ కోట వెంకటాచారి, కార్యదర్శి బొడ్డుపల్లి సుదర్శన్, ఉపాధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, కుందారం గణేష్, వడ్ల హనుమాన్లు, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ రామాచారి తదితరులతో పాటు పలు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News